ఐసీసీ ప్రపంచ ట్వంటీ-20 కప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో జాతీయ జట్టు సభ్యులైన స్పిన్నర్ జీతన్ పటేల్, ఆల్‌రౌండర్ సౌథీ, పేసర్ క్రిస్ మార్టిన్‌లకు చోటు దక్కలేదు. వచ్చే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై ఈ టోర్నీ జరుగనుంది. ఇందుకోసం జట్టుని ఎంపిక చేశారు. ఇందులో సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆల్‌రౌండర్ బ్రెండెన్ మెక్‌కల్లమ్, నాథన్ మెక్‌కల్లమ్, ఇయాన్ బట్లర్‌తో సహా, స్టాండ్‌బై వికెట్ కీపర్‌గా పీటర్ మెక్‌గ్లాషన్‌లకు చోటు కల్పించారు.
సెలక్టర్లు ప్రధానంగా లోయర్ ఆర్డర్ హిట్టర్లపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అలాగే, గాయాలబారిన పడిన జాకబ్ ఓరమ్ చోటు పొందినప్పటికీ, ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే మైదానంలో దిగే అవకాశాలు ఉంటాయి. జాకబ్ ఓరమ్‌తో సహా మరో ఆల్‌రౌండర్ గ్రాంట్ ఎలియట్‌కు కూడా చోటు కల్పించారు.
జట్టు వివరాలు.. బ్రెండెన్ మెక్‌కల్లమ్, మార్టిన్ గుప్తిల్, జెస్సీ రైడర్ రాస్ టేలర్, స్కాట్ స్టైరిష్, నైలి బ్రూమ్, జాకబ్ ఓరమ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, నాథన్ మెక్‌కల్లమ్, డేనియల్ వెటోరి (కెప్టెన్), ఇయాన్ బట్లర్, పీటర్ మెక్‌గ్లాషన్, కైల్ మిల్స్, బ్రెండెన్ డైమంటి, ఒబ్రియాన్‌లు ఉన్నారు.