న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరులుగు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. వన్డే, టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ జట్టు 1967-68 సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనలో అజిత్ వాడేకర్ 328 పరుగులు సాధించాడు.
ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న సచిన్.. అజిత్‌ను అధిగమించి 335 పరుగులు చేశాడు. చివరి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆడాల్సి ఉండడంతో సచిన్ ఈ రికార్డును మరింత మెరుగు పరుచుకోనున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ద్రవిడ్, ఫరూక్ ఇంజనీర్, అజరుద్దీన్‌లు ఉన్నారు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో 300 పైచిలుకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా సచిన్ కావడం విశేషం.