Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరేబియన్ దీవుల్లో నేటినుంచి ట్వంటీ20 సమరం..!!

Advertiesment
క్రికెట్
FILE
కరేబియన్ దీవుల్లో శుక్రవారం నుంచి ట్వంటీ20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. కాగా.. ప్రారంభ మ్యాచ్‌లలో ఓవైపు గత టీ20 ప్రపంచ కప్ విజేత శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడుతుండగా.. మరో మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్, క్రికెట్ పసికూన ఐర్లండ్ జట్టుతో తలపడనుంది.

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ సమరం మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ సమాన బలంతో కనిపిస్తున్నాయి. అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగిన బ్రెడన్ మెక్‌కల్లమ్‌తోపాటు రాస్ టేలర్, జెసీ రైడర్ లాంటి స్టార్ బ్యాట్స్‌మన్లకు న్యూజిలాండ్ జట్టులో కొదువలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. డానియల్ వెటోరీ, షేన్ బాండ్ లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు.

ఇక లంక జట్టు విషయానికి వస్తే దిల్షాన్, సంగక్కర, జయవర్ధనేలతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టవంతంగా ఉందనే చెప్పవచ్చు. మలింగ, మురళీధరన్, మెండీస్‌లతో బౌలింగ్ విభాగానికి ఢోకా లేదు. ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ జట్టులో ఉండటం మరో సానుకూలాంశం. అయితే దిల్షాన్ ఫామ్‌లో లేకపోవటం జట్టును కలవరపరుస్తోంది. అయితే గత ఐదు ట్వంటీ20లలో నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోవటం కూడా లంకకు ప్రతికూలాంశమే.

మరోవైపు గ్రూపు డి విభాగంలో జరిగే మరో ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు, క్రికెట్ పసికూన ఐర్లండ్‌తో తలపడనుంది. అనూహ్యమైన సంఘటనలు ఏవైనా చోటు చేసుకుంటే తప్ప, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయాన్ని ఆపవచ్చు. లేదంటే ఖచ్చితంగా విజయం వెస్టిండీస్‌దే. విజయంపై ఎలాంటి ఆశలూ లేని ఐర్లండ్, ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇస్తే చాలనే ఉద్దేశ్యంతో బరిలో దిగనుంది.

Share this Story:

Follow Webdunia telugu