ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కొత్త కెప్టెన్ యూనిస్ఖాన్ నెంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించి మ్యాచ్ డ్రా అయ్యేందుకు కీలక పాత్ర పోషించినందుకు యూనిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌కు చేరుకున్నాడు.
కరాచీ టెస్ట్‌లో ఏకంగా 13 గంటలపాటు బ్యాటింగ్ చేసిన యూనిస్... వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చందర్‌పాల్ స్థానాన్ని కైవసం చేసుకుని యూనిస్ నెం.1గా నిలిచాడు. అంతేగాకుండా, ట్రిపుల్ సెంచరీని సాధించిన మూడవ పాక్ క్రికెటర్‌గా యూనిస్ చరిత్ర సృష్టించాడు.
ఇదే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్దనే నాలుగో స్థానంలోనే కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మైకెల్ క్లార్క్ ఐదో స్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న చందర్‌పాల్ ప్రస్తుతం రెండో స్థానంలోనూ, కుమార సంగక్కర (శ్రీలంక) మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే... ఈ తాజా ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ రూపంలో ఒకే ఒక్క ఆటగాడు టాప్-10లో నిలవడం గమనించదగ్గ అంశం. కాగా, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో గంభీర్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే... ప్రస్తుత కివీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శనను కనబర్చాల్సి ఉంటుంది.