ఐపీఎల్ ఫైనల్ పోటీలో సచిన్ అంచనా తప్పు: షేన్‌వార్న్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె ఫైనల్ సమరంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ తప్పుగా అంచనా వేశారని రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. పైనల్ పోటీలో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు చేతిలో పరాజయం పాలైన విషయం తెల్సిందే. దీనిపై వార్న్ మాట్లాడుతూ ఆఖరి పోటీలో సచిన్ తప్పుగా అంచనా వేశారన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌ను సద్వినియోగం చేసుకోవడంలో సచిన్ విఫలమయ్యాడన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో నాయర్‌కు బదులుగా డుమినీ పంపి, నాయర్‌ను ఏడో బ్యాట్స్‌మెన్‌గా పంపినట్టయితే ఫలితం మరోలా ఉండేదన్నారు. అలాగే, పోలార్డ్‌ను ఎనిమిదో బ్యాట్స్‌మెన్‌గా పంపడాన్ని కూడా వార్న్ తప్పుబట్టాడు. ఇలా మ్యాచ్‌లో పలు తప్పులను చేశాడని, అందువల్ల ఆ జట్టు ఫైనల్లో బోల్తా పడిందని, అదేసమయంలో ముంబై జట్టుకు అదృష్టం కూడా కలిసి రాలేదని వార్న్ అభిప్రాయపడ్డారు.