Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ ట్వంటీ-20: పంజాబ్‌ కింగ్స్‌తో డెక్కన్ ఛార్జర్స్ ఢీ నేడే!

Advertiesment
ఐపీఎల్
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. శుక్రవారం జరిగే 51వ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాదీ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ధర్మశాలలో జరిగే ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ నాయకత్వం వహించే డెక్కన్ ఛార్జర్స్, సంగక్కర కెప్టెన్సీ సారథ్యంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య రసవత్తరమైన పోరు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ఈ మ్యాచ్‌లో సెమీఫైనల్ అవకాశాల కోసం ఉవ్విళ్లూరుతున్న డెక్కన్ ఛార్జర్స్, ఇప్పటికే సెమీస్ ఆశలను చేజార్చుకున్న పంజాబ్‌ను మట్టికరిపించేందుకు సాయశక్తులా ప్రయత్నించే అవకాశం ఉంది. కాగా.. డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్-3 సెమీఫైనల్లోకి ప్రవేశించాలంటే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ధీటుగా ఎదుర్కొని, చక్కని రన్‌రేట్‌తో నెగ్గాల్సిన అవసరం ఉంది.

మరోవైపు సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న పంజాబ్.. ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అలాగే సెమీస్ అవకాశాలను కోల్పోయినప్పటికీ.. ఐపీఎల్ పట్టికలో ఎగబాకేందుకు పంజాబ్ తహతహలాడుతోంది. మొత్తానికి పంజాబ్‌పై నెగ్గుతుందా..? లేదా? వేచి చూడాల్సిందే..!

Share this Story:

Follow Webdunia telugu