ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ గెలుపే అంతిమ లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
ఈ రెండు జట్ల ఒక సారూప్యత ఉంది. టోర్నీ ఆరంభంలో ఇరు జట్టూ తొలి రెండు మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి ప్రత్యర్థి జట్లకు దడపుట్టించాయి. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌లలో వరుస పరాజయాలను నమోదు చేసుకున్నాయి.
ఆపైన సోమవారం నాటికి మ్యాచ్‌కు ముందు జరిగిన మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఈనెల 25వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డీడీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే, 27వ తేదీన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 39 పరుగులతో విజయభేరీ మోగించి గెలుపుగాడిన పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం జరిగే మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. వరుస పరాజయాల అనంతరం ఒక విజయంతో తిరిగి గాడిన పడిన ఈ జట్లు మరో విజయంతో ముందుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నాయి.