ఐపీఎల్-3: స్లో ఓవర్ రేటుతో పంజాబ్ కింగ్స్‌కు జరిమానా!
స్లో ఓవర్ రేటు కారణంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ఫ్రాంచైజీ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు భారీ జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పంజాబ్ నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం నిర్ధారించింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం కింగ్స్ కెప్టెన్ సంగక్కరకు 40వేల డాలర్లు, జట్టులోని సభ్యులకు పదివేల డాలర్ల చొప్పున గురువారం జరిమానా విధించారు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో పంజాబ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మొహలీలో జరిగిన 19వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.