ప్రపంచ మహిళా క్రికెట్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. సిడ్నీలోని ఓవెల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియ మహిళా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 44.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు పరుగులు తీయకుండా భారత మహిళా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అయితే, కెప్టెన్ రోల్టాన్ మాత్రం అర్థ సెంచరీతో జట్టును ఆందుకునే ప్రయత్నించినప్పటికీ, టెయిల్ ఎండ్ బ్యాట్స్‌ఉమెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకోవడంతో 142 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు మరో 13 బంతులు మిగిలి ఉండగానే 145 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు.
రాయ్ (6) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ రెండంకెల స్కోరుతో రాణించారు. దీంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో రాణించిన ధర్‌కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్"ను కైవసం చేసుకుంది.