దక్షిణాఫ్రికా జట్టుకు ఓ శుభవార్త. ఆ జట్టు ఆల్‌రౌండర్ జాక్వెస్ కలీస్ ఫిట్‌నెస్ సాధించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఐదు వన్డేల సిరీస్‌కు కలీస్ అందుబాటులోకి రానున్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతూ వచ్చిన కలీస్‌కు ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించగా ఇందులో పాసైనట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
మార్చి 22వ తేదీన కేప్‌టౌన్ టెస్టు చివరి రోజున బౌలింగ్ చేస్తున్న సమయంలో కలీస్ గాయం ఏర్పడింది. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో గాయం ఛాయలు ఎక్కడా కనిపించడం లేదని జట్టు ప్రతినిధి మైఖేల్ ఓవెన్ స్మిత్ వెల్లడించాడు. అందువల్ల శుక్రవారం జరిగే తొలి వన్డేలో కలీస్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపాడు.
అలాగే, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ పార్నెల్‌ను కూడా జాతీయ జట్టుకు ఎంపికైనట్టు చెప్పాడు. 19 సంవత్సరాల పార్నెల్‌కు జాతీయ జట్టులో 17వ ఆటగాడిగా కాంట్రాక్టు లభించింది. జనవరి నెలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో పార్నెల్ బరిలోకి దిగాడు.