Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వదేశానికి అంజాద్ ఖాన్ తిరుగుముఖం

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు ఆసీస్ వన్డే సిరీస్ జాక్వెస్ కల్లీస్ స్థానం దక్షిణాఫ్రికా డర్బన్ కండరాల గాయం వేన్ పార్నెల్ సెంట్రల్ కాంట్రాక్ట్
వెస్టిండీస్‌తో కరేబియన్ గడ్డపై జరగాల్సిన టెస్టు సిరీస్‌‌లో ఆడేందుకు వెళ్లిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అంజాద్ ఖాన్ స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. మోకాళ్ల గాయం కారణంగా ఈ పర్యటన నుంచి అంజాద్ ఖాన్ తప్పుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో, అంజాద్ మోకాలి గాయంతో బాధపడ్డాడు.

అంజాద్ స్కాన్ రిపోర్టును పరిశీలించిన అంజాద్ మైదానంలోకి దిగి ఆడటం మంచిది కాదని వైద్యులు పేర్కొన్నారు. అంతేగాకుండా అంజాద్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఈ ఫాస్ట్ బౌలర్ ఇంటిముఖం పట్టాడు.

ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్, రియాన్ సైడ్‌బాటమ్ గాయాల కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో జట్టులోకి ప్రవేశించిన అంజాద్ కూడా అదే కారణంతో ఈ 28 ఏళ్ళ బౌలర్, అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలో 29 ఓవర్లకు బౌలింగ్ చేసి, 1-111 సగటుతో స్వదేశానికి చేరుకోనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu