Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెమీస్‌ బెర్త్ కోసం.. మళ్లీ పుంజుకుంటాం..!: రాహుల్ ద్రావిడ్

Advertiesment
రాహుల్ ద్రావిడ్
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసేందుకు మళ్లీ పుంజుకుంటామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్, మాజీ టీం ఇండియా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ నమ్మకం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో ఐదింటిలో తమ జట్టు.. తదుపరి మ్యాచ్‌ల్లో సెమీఫైనల్ చేరుకోవడమే లక్ష్యంగా ఆడుతుందని రాహుల్ ద్రావిడ్ అన్నాడు.

ఐదింటింలో విజయం, మరో ఐదింటిలో పరాజయం పాలైన తమ జట్టు సెమీస్ ఆశలను సజీవం చేసుకోవాలంటే.. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో గట్టిపోటీని ప్రదర్శించాల్సి ఉంటుందని ద్రావిడ్ వెల్లడించాడు. ఐపీఎల్-3 ఆరంభంలో విజయాలను నమోదు చేసుకున్న తమ జట్టు, చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమిని చవిచూసిందన్నాడు.

అయితే ఐపీఎల్ మూడో సీజన్‌ను విజయాలతో ప్రారంభించడమే తమ జట్టుకు సహకరిస్తుందని రాహుల్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్-3లో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్న తమ జట్టు తప్పకుండా తదుపరి మ్యాచ్‌ల్లో ధీటుగా రాణించే ప్రయత్నం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే.. సౌరవ్ గంగూలీ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. శనివారం రాత్రి జరిగే ఈ 43వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు కేకేఆర్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గాయాలతో అందుబాటులో ఉండడని సమాచారం. కేకేఆర్‌కు కెప్టెన్ లేకపోవడం దెబ్బేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌ల్లో కుంబ్లే జట్టు నెగ్గుతుందా..? లేదా గంగూలీ సేన విజయాన్ని సొంతం చేసుకుంటుందా..? అనేది వేచి చూడాల్సిందే..!.

Share this Story:

Follow Webdunia telugu