Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సస్పెండే అయ్యా.. నేనింకా ఐపీఎల్ కమీషనర్‌నే..!: మోడీ

Advertiesment
లలిత్ మోడీ
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తానింకా ఐపీఎల్ కమీషనర్‌నే అని అంటున్నారు.

ప్రస్తుతానికి సస్పెండ్ మాత్రమే అయ్యాయని.. కానీ ఇంకా ఐపీఎల్ కమిషనర్‌నేని మోడీ చెప్పారు. ఇప్పుడే అసలు ఆట మొదలైందని, ఇకపై ఏం జరుగుతుందో చూడాలని లలిత్ మోడీ వెల్లడించారు. ఇంతకాలం మద్దతు పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ట్విట్టర్‌లో లలిత్ మోడీ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ఛైర్మన్‌ పదవి నుంచి లలిత్ మోడీని బీసీసీఐ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో లలిత్ మోడీ వ్యవహారంపై బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా.. ఐపీఎల్ తాత్కాలిక ఛైర్మన్‌గా చిరాయు అమీన్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu