షోయబ్ మాలిక్... ఊసరవెల్లి తాతకు ముత్తాత
తన కుమార్తె అయేషాను పెళ్లాడలేదని బుకాయిస్తూ వచ్చిన షోయబ్ అసలు రంగు బయట పెట్టినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉన్నదనీ, న్యాయానికి విజయం దక్కిందని అయేషా సిద్దిఖీ తల్లి మీడియా సమావేశంలో వెల్లడించింది. ముస్లిం మత సంప్రదాయాలకు అనుగుణంగా తలాక్ చెప్పిన తర్వాత ఓ భర్త, భార్యకు చెల్లించాల్సిన భరణం కూడా మూడు నెలలపాటు వస్తుందని తెలిపింది.ఇదిలావుంటే పాకిస్తాన్లో షోయబ్‌కు ఇంటిపోరు కూడా ఎక్కువైనట్లు సమాచారం. షోయబ్ సోదరుడు తారిఖ్ మాలిక్ అయేషాకు మద్దతుగా నిలుస్తానని షోయబ్‌ను హెచ్చరించినట్లు తెలిసింది. అయేషాతో షోయబ్ పెళ్లి నిజమేనని, ఇద్దరి పెళ్లికి తాను హాజరయ్యానని మీడియా ముందు చెపుతానని వెల్లడించినట్లు సమాచారం. దీంతో షోయబ్ మాలిక్ కాళ్ల బేరానికి రాక తప్పలేదు.సానియాతో వివాహమే లక్ష్యంగా షోయబ్ మాలిక్, మొదటి భార్యగా చేసుకున్న అయేషాపై అనేక ఆరోపణలు చేశాడు. మొన్న మీడియా సమావేశంలో అయేషా తనకు అక్కలా ఉందని అత్యంత ఘోరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇవన్నీ చూస్తుంటే షోయబ్ మాలిక్ ఊసరవెల్లిని మించిపోయి రంగులు మార్చేవాడుగా కనిపిస్తున్నట్లు బోధపడుతుంది. కట్టుకున్న భార్య ఎవరో తెలియదని బుకాయించే మోసగాడైన వ్యక్తితో సానియా మనువు కోరుకోవడంపై సర్వాత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.