షోయబ్ జల్సారాయుడు: పాక్ మీడియా గగ్గోలు
సానియా మీర్జాను వివాహమాడబోతున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మహా జల్సారాయుడని పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతోంది. రాత్రయితే చాలు... షోయబ్ మాలిక్ నైట్ పార్టీల్లో అమ్మాయిలతో చిందులేస్తూ కాలం గడుపుతాడని చెపుతున్నాయి.అంతేకాదు షోయబ్‌కు పాకిస్తాన్లో మరో అమ్మాయితో లింకు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. పాక్ మీడియాలో ఓ ఛానల్ అయితే నిన్నటి నుంచి షోయబ్ - గుర్తు తెలియని ఓ అమ్మాయితో వేసిన చిందుల తాలూకు 15 ఫోటోలను ప్రదర్శిస్తూ ఒకటే గోల చేస్తోంది.సానియా - షోయబ్ పెళ్లి గడువు సమీపిస్తున్న కొద్దీ షోయబ్ చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా షోయబ్‌ను పెళ్లి చేసుకుని తీరుతానని సానియా గట్టిగా చెప్పేసింది కదా. పెళ్లికి ముందే కాబోయే భర్తకు "అన్ని" విధాలా మద్దతు తెలిపే భార్య దొరకడం అదృష్టమే మరి.