Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షోయబ్ అక్తర్‌ను జట్టులోకి తీసుకోండి: మాజీ సెలక్టర్

Advertiesment
షోయబ్ అక్తర్
FILE
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ను వన్డే జట్టులోకి తీసుకోవడం మంచిదని మాజీ జాతీయ సెలక్టర్ ఇతీష్‌ముద్దీన్ పీసీబీని కోరారు. 34 ఏళ్ల స్టార్ బౌలర్‌ను తిరిగి వన్డేల్లోకి తీసుకోవడం ద్వారా జట్టు పటిష్టమవుతుందని ఇతీష్‌ముద్ధీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, గాయాలతో సతమతమవుతున్న షోయబ్ అక్తర్‌ను జట్టులోకి తీసుకోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనుకడుగు వేస్తోంది. ఇంకా అక్తర్ క్రమశిక్షణపై పీసీబీ మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్‌ను వన్డేల్లోకి తీసుకోవాలని ఇతీష్‌ముద్ధీన్ పీసీబీని కోరారు.

ఆప్ఘనిస్థాన్ జాతీయ జట్టు తరపున ఆడేందుకుగాను గత వారం లాహోర్‌లో ప్రాక్టీస్‌లో నిమగ్నమైన షోయబ్ అక్తర్‌ను పాక్ వన్డే టీమ్‌లోనూ అవకాశం కల్పించాలని ఇతీష్‌ముద్ధీన్ పీసీబీని అభ్యర్థించారు.

ఈ విషయమై షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టులో తిరిగి స్థానం పొందడమే లక్ష్యమని చెప్పాడు. తప్పకుండా పాక్ జట్టు తరపున ఆడే అవకాశం తనకు తిరిగి లభిస్తుందని అక్తర్ నమ్మకం వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu