కుడి చేతి చిటికెన వేలు గాయంతో మూడో టెస్టుకు దూరమైన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం నుంచి డర్బన్‌లో ఈ వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ వేసిన బంతి స్మిత్ కుడిచేతి చిటికెన వేలును తాకడంతో దెబ్బతగిలిన విషయం తెల్సిందే.
ఫలితంగా మూడో టెస్ట్‌తో పాటు ఆ తర్వాత జరిగిన రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లకు స్మిత్ దూరమయ్యాడు. ఈ గాయం నుంచి వేగంగా కోలుకున్న స్మిత్ ప్రస్తుతం ముమ్మరంగా నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో ఎంతో పురోగతి కనిపిస్తోందని జట్టు ప్రతినిధి మిచెల్ ఓవెన్ తెలిపినట్టు హెరాల్డ్ సన్ పత్రిక పేర్కొంది. ఈ యేడాది జనవరిలో ఇదేవిధంగా చిటికెన వేలికి గాయమైంది.
ఇదిలావుండగా, కేప్‌టౌన్ టెస్టులో గాయపడిన జట్టు ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లీస్ వన్డే సిరీస్‌కు దూరమయ్యేలా కనిపిస్తున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. అయితే, రెండో వన్డేలో మంచి ప్రతిభ చూపిన ఆల్‌రౌండర్ రోలోఫ్‌ను తొలి రెండు వన్డేల కోసం తీసుకున్న విషయం తెల్సిందే.