Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వన్డేల్లో సచిన్ ఆడితే.. అంతే.. రైడర్

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు సచిన్ పరిస్థితి విభిన్నం ఓపెనర్ జెస్సి రైడర్ టీం ఇండియా వన్డే సిరీస్
ప్రపంచంలో అత్యుత్తమ జట్టైన భారత్‌పై ట్వంటీ-20 మ్యాచ్‌లలో రాణించడం తమకు భారీ గెలుపని, అయితే వన్డే సిరీస్‌లలో సచిన్ రాకతో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చునని న్యూజిలాండ్ ఓపెనర్ జెస్సి రైడర్ అన్నాడు. ట్వంటీ-20 విజయాల తర్వాత జట్టు పూర్తి విశ్వాసంతో ఉందని, కానీ వన్డే సిరీస్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రభావం చూపుతాడని రైడర్ చెప్పాడు.

టీం ఇండియా ఇప్పటికే ప్రపంచ క్లాస్ జట్టని, ఇంకా తమ జట్టు ఉత్తమమైన ఆటతీరును ప్రదర్శించాల్సి ఉందని రైడర్ తెలిపాడు.సచిన్ వన్డేల్లో ఆడుతున్నాడని, దీంతో కివీస్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రైడర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ప్రపంచంలో ఉత్తమ ట్వంటీ-20 ఓపెనర్లలో మెక్ కల్లమ్ ఒకడని, అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని రైడర్ ఆశించారు. ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని, రైడర్ చెప్పాడు. ఇకపోతే.. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu