రేపటి ఐపీఎల్ సమావేశానికి లలిత్ మోడీ హాజరు!
, ఆదివారం, 25 ఏప్రియల్ 2010 (17:58 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలక మండలి సమావేశానికి ఆ లీగ్ కమిషనర్ లలిత్ మోడీ హాజరుకానున్నారు. ఈ భేటీ సోమావరం ముంబైలో జరుగనుంది. ఐపీఎల్ వ్యవహారంపై చర్చించేందుకు భేటీ అయ్యే సమావేశంలో లలిత్ మోడీ పాల్గొనాలని నిర్ణయించడం గమనార్హం. ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహణలో నిధుల దుర్వినియోగంతో పాటు బెట్టింగ్లకు పాల్పడినట్టు లలిత్ మోడీపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్గా లలిత్ మోడీని తొలగించాలని డిమాండ్లు జోరుగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పాలక మండలి సమావేశానికి ఆయన కూడా హాజరుకానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశాన్ని నిర్వహించేందుకు బీసీసీఐకు అధికారం లేదని, అందువల్ల ఈ సమావేశంలో తాను పాల్గొనాలన్న నిబంధనేదే లేదని లలిత్ మోడీ ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చారు. అయితే, ఆకస్మికంగా ఆయన తమ మనస్సును మార్చుకున్నారు. తనపై మోపే ఆరోపణలను తెలుసుకునేందుకు గాను ఆయన ఈ సమావేశానికి హాజరుకావాలని మోడీ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.