టీం ఇండియా-న్యూజిలాండ్‌ల మధ్య వెల్లింగ్టన్‌లో జరుగుతున్న రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో... కివీస్ కెప్టెన్ వెటోరీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, తొలి ట్వంటీ20 పోరులో భారత్ బ్యాట్స్‌మెన్లు విఫలం చెందడంతో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తొలి మ్యాచ్ అపజయంతో కసిగా బరిలో దిగుతున్న టీం ఇండియా... ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఇందుకు తామేమీ తీసిపోవడం లేదన్నట్లుగా, కివీస్ ఈ మ్యాచ్‌లో కూడా గెలుపొందాలని పట్టుదలతో ఉరకలు వేస్తోంది.
ఇదిలా ఉండగా... భారత జట్టులో రోహిత్‌శర్మకు బదులు రవీంద్ర జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
భారత జట్టు : మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవీంద్రజడేజా, యూసుఫ్‌పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్, జహీర్‌ఖాన్, ఇషాంత్‌శర్మ.
న్యూజిలాండ్ : వెటోరీ (కెప్టెన్), రేడర్, మెక్‌కల్లమ్ (కీపర్), గుప్తిల్, టేలర్, జాకబ్ ఓరమ్, నీల్ బ్రోమ్, నాథన్ మెక్‌కల్లమ్, బట్లర్, సౌథీ, ఒబ్రియాన్.