రిటైర్మెంట్పై యూనిస్ మరోసారి ఆలోచించాలి: వకార్
పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ ప్రకటించిన రిటైర్మెంట్పై మరోసారి ఆలోచించాలని పాక్ నూతన కోచ్ వకార్ యూనిస్ కోరాడు. మాజీ పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు సోమవారం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకా ఆస్ట్రేలియా పర్యటనలో పేలవమైన ఆటతీరు, మ్యాచ్ ఫిక్సింగ్స్ ఆరోపణలతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొహ్మద్ యూసుఫ్‌తో పాటు యూనిస్ ఖాన్‌లపై జీవిత కాల నిషేధం విధించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో తాను ఇక కొనసాగేది లేదని, తాను జట్టులో ఉండటం వల్ల పాక్ జట్టుకే హానికరమని పీసీబీ నుంచి ఉత్తరం అందడంతోనే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని యూసుఫ్ ట్విట్టర్లో తెలిపాడు. ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలుకుతూ మొహ్మద్ యూసుఫ్ తీసుకున్న నిర్ణయంపై మరోసారి పరిశీలన చేయాలని పాక్ కొత్త కోచ్ వకార్ యూనిస్ తెలిపాడు. దేశం కోసమైనా తన నిర్ణయాన్ని మార్చుకునే దిశగా యూసుఫ్ ప్రయత్నించాలని వకార్ సూచించాడు. అద్భుతమైన బ్యాట్స్‌మెన్ జట్టుకు దూరం కావడంపై యూసుఫ్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కోచ్ పేర్కొన్నాడు.