వెన్నునొప్పితో రెండో టెస్టుకు దూరమైన 'టీమ్ ఇండియా' కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం ఫిట్నెస్ టెస్ట్‌ను ఎదుర్కోనున్నాడు. వెల్లింగ్టన్లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఆరంభమయ్యే ఆఖరి, మూడో టెస్ట్‌లో ధోనీ పాల్గొనేదీ, లేనిదీ ఈ పరీక్షతో తేలుతుంది. ధోనీ గైర్హాజరుతో రెండో టెస్టుకు సారథ్యం వహించిన సెహ్వాగ్, మూడో టెస్టులో ధోనీ ఆడేదీ లేనిదీ వెల్లడించలేదు.
రెండో టెస్ట్ ఆరంభానికి ముందురోజు సాధనలో పాల్గొన్న ధోనీ చివరి క్షణంలో వెన్నునొప్పి కారణంగా తప్పుకున్నాడు. దీంతో టెస్ట్ ఆరంభానికి ముందు రోజే సెహ్వాగ్‌కు సారథ్యం విషయమై సూచాయంగా తెలియజేశారు. టెస్ట్ తొలి రోజున టాస్కు వెళ్ళేటపుడు సెహ్వాగ్ ధోనీ బ్లేజర్‌ను ధరించడం గమనార్హం.