ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు సీనియర్ బ్యాట్స్‌మెన్ మైక్ హాస్సీకి విశ్రాంతి ఇవ్వాలని నిశ్చయించినట్లు ఆస్ట్రేలియా జట్టు సారథీ మైఖేల్ క్లార్క్ తెలిపాడు. అతడు ఫిబ్రవరి 17న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు జట్టులోకి వస్తాడని, అలాగే అతని స్థానంలో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపాడు. మార్ష్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా తరుపున ఒక్కే ఒక మ్యాచ్ ఆడాడు.
భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి సిరీస్‌లో(27 వికెట్ల్) అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ బెన్ హెల్ఫినాస్‌కు కూడా విశ్రాంతి ఇస్తామని అతని స్థానంలో బ్యాట్స్‌మెన్ పీటర్ పారెస్ట్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు క్లార్క్ తెలిపాడు. ఈ మ్యాచ్‌తో ఈ యువ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేయనున్నాడు.
కాగా ఇప్పటికే భారత్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్‌లను గెలిచి మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియా జట్టు ఆదివారం జరిగే మ్యాచ్ గెలిచి ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే భారత్ కూడా సిరీస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది.