Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీసీసీఐ నిర్ణయంపై మిల్స్ ఆగ్రహం

Advertiesment
క్రికెట్ క్రీడలు వార్తలు టీం ఇండియా మాస్లర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాస్టర్స్ న్యూజిలాండ్ మిల్స్
టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వికెట్‌ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లను ఎన్‌జెడ్‌పీసీఏ-ఏసీఏ మాస్టర్స్ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అనుమతించకపోవడంపై న్యూజిలాండ్ క్రికెట్ సంఘం చీఫ్ హీత్ మిల్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడుతున్న హిమేష్ మార్షల్ ఉన్నందున సచిన్, దినేశ్ కార్తీక్‌లను ల్గొనరాదంటూ.. బీసీసీఐ ప్రకటించిన సంగతి విదితమే. దీనికి ప్రతిస్పందనగా కివీస్ క్రికెటర్ల సంఘం సీఈవో మిల్స్ మాట్లాడుతూ.. సచిన్, దినేశ్‌లను ఈ మ్యాచ్‌లోకి ఆడేందుకు అనుమతించకుండా బీసీసీఐ మూర్ఖంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

టీం ఇండియా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడతారని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సంతోషంగా ఉన్న సమయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను ఆశ్చర్యపరచిందనీ మిల్స్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో ఆడుతున్నవారిలో అండర్-19 క్రికెటర్లు కూడా ఉన్నారనీ, అటువంటి ఆటగాళ్లు సచిన్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌‍కు బౌలింగ్ చేసే అవకాశాన్ని గొప్పగా భావిస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం వారందరినీ తీవ్రంగా నిరాశపరచిందని మిల్స్ వాపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu