భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) క్రికెట్‌కు మేలు చేయాలని అనుకోవటం లేదని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఛైర్మన్, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ధ్వజమెత్తాడు.
బెంగళూరు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన "అంతర్జాతీయ వికలాంగుల క్రీడల మస్కట్"ను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీసీఐ-ఐసీఎల్‌ల మధ్య తాజాగా చర్చలు విఫలమైన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు వ్యాఖ్యలు చేశాడు. ఆటకు మేలు చేయాలని అనుకోనివారే, ప్రస్తుతం క్రికెట్‌ను నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాము కూడా దేశంలో క్రికెట్‌ను వ్యాప్తి చేస్తున్నామనీ, అలాంటప్పుడు ఎవరూ బాధపడకూడదని, గర్వపడాలని కపిల్ వ్యాఖ్యానించాడు. ఓ క్రికెటర్‌గా ఈ విషయంలో తాను గర్వంగా ఫీలవుతున్నాననీ... ఐపీఎల్‌పై సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నాడు.