ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ ఆడనన్నాడు: భజ్జీ
కరేబియన్ గడ్డపై వచ్చే నెల చివరిలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ తరపున ఆడాల్సిందిగా హర్భజన్ సింగ్ మాస్టర్ బ్లాస్టర్‌ను కోరాడు. కానీ హర్భజన్ సింగ్ వినతిని మాస్టర్ అంగీకరించలేదని తెలిసింది.వచ్చే నెల చివరిలో వెస్టిండీస్‌లో ప్రారంభమయ్యే ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భారత్ తరపున ఆడాల్సిందిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కోరినట్లు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. అయితే టి-20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడరాదన్న నిర్ణయానికే తాను కట్టుబడివున్నట్లు సచిన్ తనతో చెప్పినట్లు భజ్జీ స్పష్టం చేశాడు. టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు ఎంపికకు ఒక రోజు ముందు సచిన్‌కు తాను ఈ విజ్ఞప్తి చేశానని హర్భజన్ చెప్పాడు. సచిన్ కూడా ఉంటే కరేబియన్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా ఉంటుందని తాను భావించినట్లు భజ్జీ పేర్కొన్నాడు. టి-20 ప్రపంచ కప్‌లో తాను ఆడబోవడంలేదని సచిన్ ఇంతకుముందే స్పష్టం చేసిన విషయం విదితమే.