ప్రపంచకప్‌కు రాబిన్ ఊతప్ప లేకపోవడం లోటే..!: జెన్నింగ్స్
కరేబియన్ గడ్డపై జరుగనున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే టీం ఇండియా జట్టులో రాబిన్ ఊతప్ప లేకపోవడం లోటేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన దక్షిణాఫ్రికా కోచ్ రే జెన్నింగ్స్ అన్నాడు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించే రాబిన్ ఊతప్పను ప్రపంచ ట్వంటీ-20కి సెలక్టర్లు ఎంపికచేయకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని జెన్నింగ్స్ చెప్పాడు. మైదానంలో బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేస్తూ.. దూకుడుగా ఆడే రాబిన్ ఊతప్ప, రెండో వికెట్ కీపర్‌గానూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాడని కోచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతీసారి క్రీజులో దిగేటప్పుడు 200% స్ట్రైక్ రేట్ వేగంతో పరుగులు సాధించాడని జెన్నింగ్స్ చెప్పుకొచ్చాడు.30
మందితో కూడిన ఉద్దేశపూర్వకమైన ప్రాబబుల్స్ జట్టులో ఊతప్ప లేకపోవడం, చివరికి 15 మంది సభ్యులతో కూడిన టీం ఇండియాలోనూ ఊతప్పకు స్థానం లభించకపోవడం జట్టుకు తీరని లోటేనని జెన్నింగ్స్ అన్నారు.