న్యూజిలాండ్‌తో రెండో టెస్టు: ఆసీస్ జట్టులో వాట్సన్..!?
న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరుగనున్న రెండో టెస్టులో ఆడే ఆస్ట్రేలియా జట్టులో ఆల్-రౌండర్ షేన్ వాట్సన్‌కు స్థానం కల్పించినట్లు వార్తలొస్తున్నాయి. నడుము నొప్పి కారణంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ తొలి టెస్టుకు దూరమైన షేన్ వాట్సన్‌ను రెండో టెస్టులో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా.. ఇప్పటికే షేన్ వాట్సన్ జట్టుతో కలిసి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. దీంతో తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫిలిప్ప్ హ్యూస్‌ను రెండో టెస్టులో ఆడే ఆసీస్ జట్టు నుంచి తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను ఆసీస్ స్టార్ క్రికెటర్ మైకేల్ హస్సీ కొట్టిపారేశాడు. కానీ సెలక్టర్లు షేన్ వాట్సన్‌కు జట్టులో స్థానం కల్పించినట్లైతే, ఏ క్రికెటర్‌ను టీమ్ నుంచి తొలగిస్తారనే అంశంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.