నేపియర్‌లో ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్ అగ్ని పరీక్ష ఎదురుకానుందని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ ఆండీ మోల్స్ జోస్యం చెప్పాడు. తొలి టెస్టు ఓటమిలో తాము చేసిన తప్పులను సరిదిద్దుకున్నామన్నారు. అందువల్ల రెండో టెస్టులో భారత్‌కు ప్రతీకారం తప్పదని మోల్స్ ధీమా వ్యక్తం చేశాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ రెండో టెస్ట్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే తాము ప్రయత్నాలు మొదలు పెట్టామని చెపుతున్నాడు.
ఇందుకోసం తమ ఆటగాళ్లు మైదానంలో ఎక్కువ సేపు గడుపుతూ కఠోర సాధన చేస్తున్నారు. జట్టు కూర్పునూ సమీక్షిస్తున్నట్టు చెప్పాడు. హామిల్టన్ టెస్టులా ఏకపక్షంగా ఈ మ్యాచ్ జరగబోదని, ఖచ్చితంగా ఆ జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకావడం ఖాయమని మోల్స్ అంటున్నాడు. తొలి టెస్టులో తమ జట్టులోని ఆటగాళ్లలో పలువురు బ్యాటింగ్‌లో రాణించక పోవడం తీవ్ర నిరాశకు లోను చేసిందని, ఫలితంగా ఓటమి పాలైనట్టు చెప్పాడు.