స్వదేశంలో భారత్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం ఆతిథ్య న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 12 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో కేవలం ఒకేఒక మార్పు మాత్రమే చేసింది. హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైన జట్టుపైనే నమ్మకం ఉంచి వారినే రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నేపియర్ టెస్టులో బ్రెంట్ ఆర్నెల్‌ను గాయం కారణంగా జట్టు నుంచి తప్పించారు.
హామిల్టన్ టెస్టులో స్వల్పంగా గాయపడిన ఒబ్రియన్, ఫ్లైన్‌లను జట్టులో తీసుకున్నారు. అయితే వీరిద్దరిని రెండు మూడు రోజుల పాటు పరిశీలించి తుది జట్టులో తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మ్ గ్లెన్ టర్నర్ వెల్లడించారు. అలాగే, జట్టు ప్రధాన బౌలర్ జాకబ్ ఓరమ్ గాయాన్ని పరిశీలించామని, అయితే ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌గా లేడని చెప్పాడు.
జట్టు వివరాలు: డేనియల్ వెటోరి (కెప్టెన్), డేనియల్ ఫ్లైన్, జేమ్స్ ఫ్రాంక్లిన్, మార్టిన్ గుప్తిల్, టిమ్ మాంటోష్, బ్రెండెన్ మెక్‌కల్లమ్, క్రిస్ మార్టిన్, కైలే మిల్స్, లైన్ ఒబ్రియన్, జీతన్ పటేల్, జెస్సీ రైడర్, రాస్ టేలర్.