ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ శుక్రవారం నుంచి డర్బన్‌లో ప్రారంభంకానుంది. అయితే, ఆస్ట్రేలియా శిబిరాన్ని బౌలింగ్ కొరత కలవరపెడుతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా, తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు 162 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఆసీస్ ఫాస్ట్‌బౌర్లు పీటర్ సైడిల్, బెన్ హిల్ఫ్‌న్‌హౌస్‌లు గాయపడ్డారు.
పాదం గాయంతో సైడిల్, వెన్నునొప్పితో హిల్ఫ్‌న్‌హౌస్‌లు బాధపడుతున్నారు. ఇది ఆస్ట్రేలియా శిబిరాన్ని వేధిస్తోంది. వీరి స్థానాలను భర్తీ చేసే బౌలర్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, వారికి అనుభవం ఎక్కువగా లేదు. ఆతిథ్యం దక్షిణాఫ్రికా జట్టు మాత్రం తొలి టెస్ట్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని పూర్తి సత్తా చాటాలని భావిస్తున్నారు.
మూడు టెస్ట్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుని, స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంగారులు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందువల్ల మిగిలిన రెండు టెస్ట్‌లలో విజయం సాధించడం లేదా, డ్రా చేసుకుని, సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో తమకు అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఇరు జట్ల వివరాలు..
దక్షిణాఫ్రికా జట్టు.. గ్రేమ్ స్మిత్, మెఖంజీ, ఆమ్లా, కెల్లీస్, విలియర్స్, డుమినీ, మార్క్ బౌచర్, మోర్కెల్, పాల్ హరీస్, స్టైన్, ఎన్తిని, అల్బియా మోర్కెల్.
ఆస్ట్రేలియా జట్టు.. కటిచ్, హ్యుగాస్, రికీ పాంటింగ్, మైక్ హుస్సే, మేఖేల్ క్లార్క్, నార్త్, బ్రాడ్ హిడ్డిన్, జాన్సన్, హిల్ఫ్‌న్‌హౌస్, బోలింగర్, పీటర్ సైడిల్, హౌరిట్జ్, మెక్ గైన్, ఆండ్రూ మెక్ డోనాల్డ్, బ్రెట్ గీవీస్, స్టీవ్ మగోఫిన్.