ట్వంటీ-20 ప్రపంచకప్: ఆసీస్ జట్టులో బ్రెట్‌లీకి స్థానం!
కరేబియన్ గడ్డపై వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్టాత్మిక ట్వంటీ-20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 30 నుంచి మే 16వరకు వెస్టిండీస్ జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తరపున ఆడే 15 మంది సభ్యులతో కూడిన ఆటగాళ్ల వివరాలను ఆ దేశ జాతీయ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇందులో గాయాలతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికిన స్టార్ పేస్ బౌలర్ బ్రెట్‌లీకి స్థానం కల్పించారు. మోచేతి గాయం కారణంగా బాధపడిన ఈ ఆసీస్ బౌలర్ ఇటీవల అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగేందుకు గాను టెస్టు క్రికెట్‌కు దూరమైన బ్రెట్‌లీ ప్రపంచకప్ ట్వంటీ-20లో మెరుగ్గా ఆడే అవకాశం ఉందని సెలక్టర్లు భావిస్తున్నారు. దీంతో ఆసీస్ ట్వంటీ-20 ప్రపంచకప్ జట్టులో బ్రెట్‌లీకి స్థానం కల్పించారు. బ్రెట్‌లీతో పాటు ఆల్ రౌండర్ కేమరూన్ వైట్‌కు కూడా జట్టులో స్థానం దక్కింది. ఇకపోతే.. ఆసీస్ ట్వంటీ-20 జట్టుకు మైకేల్ క్లార్క్ నాయకత్వం వహిస్తాడు.ట్వంటీ-20 పురుషుల జట్టు: మైఖేల్ క్లార్క్ (కెప్టెన్), కేమరూన్ వైట్ (వైస్-కెప్టెన్) డానియల్ క్రిస్టియన్, బ్రాడ్ హడ్డిన్, నాథన్ హారిడ్జ్, డేవిడ్ హస్సీ, మైక్ హస్సీ, మిట్చెల్ జాన్సన్స బ్రెట్‌లీ, డిర్క్ ననేన్స్, టిమ్ పైనీ, స్టీవెన్ స్మిత్, షాన్ టైట్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్. ట్వంటీ-20 మహిళా జట్టు: జోడీ ఫీల్డ్స్ (కెప్టెన్), అలెక్స్ బ్లాక్వెల్ (వైస్-కెప్టెన్) జెస్సికా కేమరూన్, సారా ఎలియెట్. రెనె ఫరెల్, రాచేల్ హేన్స్, జూలీ హంటర్, షెల్లీ నిచే, ఎరిన్ ఆస్బర్న్, ఎల్లిసి పెర్రి, లీయా పౌల్టన్, లీజా, క్లియా స్మిత్, ఎలిసే విలాని.