వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టు కివీస్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో, టీం ఇండియా ఆటగాళ్లు రాణించడంపై జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 33 ఏళ్ళ తర్వాత కివీస్‌పై టీం ఇండియా విజయాన్ని నమోదు చేసుకుని, పాత రికార్డును తిరగ రాసేందుకు కృషి చేయాలని శ్రీకాంత్ సూచించారు. దీనికోసం భారత్ జట్టు ఆటగాళ్లు గట్టిపోటీని ప్రదర్శిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
కివీస్‌తో జరిగే మూడో టెస్టులో భారత క్రికెట్ జట్టు విజయాన్ని నమోదు చేసుకుంటుందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. టీం ఇండియాలో మెరుగైన ఆటతీరను ప్రదర్శించే క్రికెటర్లున్నారని ఆయన వెల్లడించారు. మొత్తానికి ఆతిథ్య జట్టు కివీస్‌ను మట్టికరిపించి, టీం ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని శ్రీకాంత్ నమ్మకం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. వెల్లింగ్టన్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ ఆరంభంలో తడబడినా టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్ల పుణ్యమాని కోలుకుంది. ఫలితంగా తొలి రోజు ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది.