Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జట్టులో స్థానం దక్కపోతే.. రిటైర్మెంట్ ప్రకటిస్తా: బ్రెట్‌లీ

Advertiesment
బ్రెట్లీ
FILE
ఆస్ట్రేలియా టెస్టు జట్టులో స్థానం లభించని పక్షంలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా గాయాల కారణంగా జట్టుకు దూరమైన బ్రెట్‌లీ.. తన హోదాను చేజార్చుకోవడం ఇష్టం లేదన్నాడు.

తన క్రికెట్ కెరీర్‌లో టెస్టు ఫాస్ట్ బౌలర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తాను, ఆసీస్ టెస్టు జట్టులో స్థానం లభించకపోతే క్రికెట్ కెరీర్‌లో కొనసాగనని స్పష్టం చేశాడు.

టెస్టు బౌలింగ్‌పైనే తన దృష్టంతా ఉందని, అలాంటి టెస్టు క్రికెట్ ద్వారా తనకు లభించిన గౌరవాన్ని దిగజార్చుకునే ప్రసక్తే లేదని బ్రెట్‌లీ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్‌గా టెస్టు క్రికెట్‌లో తనకు చోటు కల్పించని పక్షంలో.. అదే రోజున తన క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని బ్రెట్‌లీ అన్నాడు.

ఫాస్ట్‌బౌలింగ్ ద్వారా బ్యాట్స్‌మెన్ల మదిలో గుబులుపుట్టించే తానకు, ఫాస్ట్ బౌలింగ్ ఉత్సాహాన్నిస్తుందని బ్రెట్‌లీ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే తపనతో తన కుమారుడిని చూడకుండా ఆరునెలల పాటు దూరంగా ఉన్నానని అతడు వివరించాడు.

Share this Story:

Follow Webdunia telugu