ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తన విజయపరంపరను కొనసాగిస్తోంది. ఆ జట్టు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ వీరవిహారం చేయడంతో సచిన్ టెండూల్కర్సేన 41 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య కీలక పోటీ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఆ తర్వాత 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి తిగిన గిల్లీ సేన 131 పరుగులకే కుప్పకూలింది.
సచిన్ సేనలో.. హర్భజన్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ (49 పరుగులు) చేయడమేకాకుండా, బౌలింగ్‌లో (మూడు వికెట్లు) కూడా రాణించాడు. దీంతో ప్రత్యర్థి జట్టు తలవంచక తప్పలేదు. ఈ మ్యాచ్‌తో ముంబై సేన తాను ఆడిన ఆరు మ్యాచ్‌లోల ఐదింటిలో విజయం సాధించగా, ఒకదానిలో పరాజయం పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.