ఐసీసీ ట్వంటీ-20 ట్రోఫీని గెలిచి తీరుతాం: ఆసిఫ్
కరేబియన్ గడ్డపై ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐసీసీ ట్వంటీ-20 ట్రోఫీని గెలిచి తీరుతామని పాకిస్థాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్ ఈసారి కూడా ట్రోఫీని గెల్చుకుంటామని ఆసిఫ్ నమ్మకం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పాక్ క్రికెటర్లందరూ శిక్షణా శిబిరంలో తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నామని ఆసిఫ్ తెలియజేశాడు. ట్వంటీ-20 ప్రపంచకప్ మెగా ఈవెంట్‌లో ప్రత్యర్థి జట్లపై గట్టిపోటీని ప్రదర్శించేందుకు తమ జట్టు క్రీడాకారులు పూర్తి శిక్షణలో నిమగ్నమయ్యారని చెప్పాడు.తమ జట్టు సభ్యులందరికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో లాహోర్ శిక్షణా శిబిరం పూర్తి శిక్షణ ఇస్తుందని ఆసిఫ్ తెలిపాడు. ఆటలోని మెలకువలన గ్రహించి, తప్పిదాలను సరిచేసుకుని వరల్డ్ కప్ క్రీజులోకి దిగుతామని ఆసిఫ్ వెల్లడించాడు. దీంతో ఈ ఏడాది కూడా ట్వంటీ-20 వరల్డ్ కప్ గెలిచితీరుతామని ఆసిఫ్ నమ్మకం వ్యక్తం చేశాడు.