Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్-3: రాయల్స్‌పై ధోనీ సేన ఘన విజయం

Advertiesment
ఇండియన్ ప్రీమియర్ లీగ్
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ సేన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా నాలుగు ఓటమిల తరువాత కాస్త కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఓపెనర్ మురళీ విజయ్ విజృంభించి ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. ఓపెనర్ కలిస్ 52, విరాట్ కోహ్లీ 34, పీటర్సన్ 23 నాటౌట్, వైట్ 21 నాటౌట్, ఊతప్ప 21 పరుగులను సాధించి, చెన్నై సూపర్ కింగ్స్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసి, విజయం సొంతం చేసుకుంది. సుడిగాలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై ఓపెనర్ మురళీ విజయం 78 పరుగులు సాధించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజయ్ తొలి వికెట్‌కు హేడెన్‌తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తరువాత విజయ్, హేడెన్‌ల నిష్క్రమణ తరువాత బరిలో దిగిన ధోనీ 14, మోర్కెల్ 1, బద్రినాథ్ 7 పరుగులతో వెంటవెంటనే పెవిలియన్ చేరారు.

అయితే చివర్లో సురేష్ రైనా 44 (నాటౌట్) పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది. కాగా.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మురళీ విజయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu