ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. మూడు వరుస పరాజయాల తర్వాత సౌరవ్ సేనకు దక్కిన విజయం. కింగ్స్ లెవన్ పంజాబ్‌పై 36 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సౌరవ్ గంగూలీ 50: (40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ 75 నాటౌట్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించడంతో నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
అనంతరం పంజాబ్ ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ సంగక్కర (30: 27 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మనోజ్ తివారీకి దక్కింది. కాగా, ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ జట్టుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.