Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌పై దృష్టి పెట్టడం ముఖ్యం : ధోనీ

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు ప్రపంచకప్ న్యూజిలాండ్ ట్వంటీ20 మ్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టీం ఇండియా కెప్టెన్ ధోనీ
ప్రపంచకప్ సన్నాహకాల కోసం న్యూజిలాండ్‌తో జరిగే ట్వంటీ20 మ్యాచ్‌లకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై దృష్టి పెట్టడమే మంచిదని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఈ విషయమై ధోనీ మాట్లాడుతూ... ప్రతి మ్యాచ్ ముఖ్యమైనప్పటికీ... వరల్డ్ కప్‌ సన్నాహకం కోసం కివీస్‌తో జరిగే అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లకంటే, ఐపీఎల్‌పై దృష్టి పెట్టడమే ముఖ్యమని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టీం ఇండియా క్రికెటర్లకు మాత్రమే కాకుండా, టోర్నీలో ఆడుతున్న ఇతర క్రికెటర్లకు కూడా సహాయపడుతుందన్నాడు.

ప్రపంచకప్ జరిగేందుకు ఇంకా చాలా సమయం ఉందనీ... ప్రస్తుతం జరిగే రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు అప్పటికి సహాయపడతాయని తాను అనుకోవడం లేదని ధోనీ చెప్పారు. కాగా, వరల్డ్‌కప్‌కు ముందు టీం ఇండియాకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు ట్వంటీ20 మ్యాచ్‌లే చివరివి కావడం గమనార్హం.

ఇక కివీస్ సిరీస్ గురించి ధోనీ మాట్లాడుతూ... మాజీ టీం ఇండియా కోచ్ జాన్‌రైట్ సలహాలు ఆతిథ్య జట్టుకు మేలు చేస్తాయని అన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా, కోచ్‌గా రైట్ అనుభవజ్ఞుడని, అతడికి భారత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి మనస్తత్వం బాగా తెలుసని చెప్పాడు. ఈ సమాచారం కివీస్‌కు ఎంతగానో మేలు చేస్తుందనీ, సమిష్టి కృషికి పెట్టింది పేరైన కివీస్ ఏ ఒక్క ఆటగాడిపైనా ఆధారపడదని ధోనీ ప్రశంసించాడు.

Share this Story:

Follow Webdunia telugu