కటక్‌లో జరుగుతున్న దేవ్‌ధర్ ట్రోఫీ టైటిల్ టోర్నీలో ఈస్ట్ జోన్‌పై వెస్ట్ జోన్ 218 పరుగులు తేడాతో గెలుపొందింది. వెస్ట్‌జోన్ కెప్టెన్ వసీం జాఫర్ 108 బంతుల్లో 116 పరుగులు.. ఛటేశ్వర్ పుజారా 86 బంతుల్లో 94 పరుగులతో రాణించడంతో ఈస్ట్‌జోన్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ లక్ష్య ఛేదనలో 39.4 ఓవర్లలో 144 పరుగులకే ఈస్ట్‌జోన్ చతికిలబడింది. దీంతో వెస్ట్‌జోన్ తొమ్మిదోసారి ఈ టో్ర్నీ టైటిల్‌ను గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్‌జోన్ జాఫర్, పుజారాల బ్యాటింగ్ మెరుపులతో రికార్డు స్థాయిలో 362 పరుగులను చేసింది.
ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయినప్పటికీ.. వెస్ట్‌జోన్ కోలుకుని ఈ స్కోరు చేయడం విశేషం. జాఫర్, పుజారాలతో పాటు చివరలో రవీంద్ర జడేజా (61 నాటౌట్), అభిషేక్ నాయర్ (54 నాటౌట్)లు కూడా ఈస్ట్‌జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఈస్ట్‌జోన్‌కు కష్టాలు తప్పలేదు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌జోన్ ఏ దశలోను లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగలేదు. వరుసగా వికెట్లను సమర్పించుకోవడంతో 144 పరుగులకే ఈస్ట్‌జోన్ చాపచుట్టేసింది.