Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై అలా ఉండబోము : కివీస్ కోచ్

Advertiesment
క్రికెట్ క్రీడలు టీం ఇండియా భారత్ న్యూజిలాండ్ కివీస్ ప్రణాళిక మైదానం కోచ్ ఆండీ మోల్స్ సిరీస్ ప్రాక్టీస్ బౌలర్లు బౌలింగ్
టీం ఇండియా ఆటగాళ్లను కట్టడి చేసేందుకు తమ వద్దకు తగిన ప్రణాళికలు ఉన్నాయనీ... కానీ వాటిని మైదానంలో అమలుపరచడంలో అలక్ష్యం వహించామనీ, ఇకపై అలా ఉండబోమనీ న్యూజిలాండ్ కోచ్ ఆండీ మోల్స్ వ్యాఖ్యానించాడు. ప్రణాళికలు కాగితంపై ఉంటే సరిపోదనీ, వాటిని అమలుపరచడమే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్లకు సూచించాడు.

భారత్‌తో వన్డే సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే, ఈ అలక్ష్యాన్ని వీడి.. శక్తిమేరకు రాణించాలని ఆండీ మోల్స్ కివీస్ బౌలర్లకు సలహా ఇచ్చాడు. మూడో వన్డేలో బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, నిజానికి బాగానే ప్రాక్టీస్ చేసినప్పటికీ మైదానంలో సరిగా బౌలింగ్ చేయలేదని అన్నాడు.

భారత్‌తో మిగిలిన వన్డేలను గెలుచుకుని సిరీస్‌ను డ్రా చేసుకునే సత్తా కివీస్‌కు ఉందని మోల్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీం ఇండియా ఆటగాళ్లు ఇక్కడి చిన్న మైదానాల్లో ఆడారనీ, అదీగాకుండా ఆ జట్టులో ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఉన్నారని పేర్కొన్నాడు.

ప్రతిదీ వారికి అనుకూలంగానే ఉందనీ, అలాగే పరిస్థితులను సైతం భారత జట్టుకు తాము అనుకూలంగా మారుస్తున్నామనే అభిప్రాయం కూడా తనలో ఉందని మోల్స్ చెప్పాడు. మిగిలిన రెండు వన్డేలలో దీన్ని సరిచేస్తామని... ఇప్పటిదాకా బౌలింగ్ సరిగా చేయలేకపోయామనీ.. ఇకపై అలా ఉండబోయేది లేదని స్పష్టం చేశాడు.

బుధవారం హామిల్టన్‌లో జరగబోయే నాలుగో వన్డేలో కివీస్ జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుందనీ... గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ఈ మైదానం తమకు బాగా అచ్చి వస్తుందని మోల్స్ తెలిపాడు. బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ, బౌలింగ్‌లోనే సరైన ప్రదర్శన కొరవడుతోందని.. ఈ సమస్యను నాలుగోవన్డేలో ఖచ్చితంగా అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu