Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాతో తొలిటెస్టు: టఫీ చేతికి గాయం!

Advertiesment
న్యూజిలాండ్
FILE
న్యూజిలాండ్ బౌలర్ టఫీకి గాయం ఏర్పడింది. అయితే కరేబియన్ గడ్డపై వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో టఫీ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు తెలిపాయి. వెల్లింగ్టన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.

ఈ టెస్టులో ఎడమచేతి ఎముక విరగడంతో టఫీ అక్లాండ్‌లోని మిడిల్‌మోర్ ఆస్పత్రిలో గురువారం శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. మిట్చెల్ జాన్సన్‌‌‌కు బంతులేయడంతో టఫీ గాయానికి గురైయ్యాడు.

దీంతో వైద్యుల సలహాల మేరకు శస్త్రచికిత్స చేయించుకోనున్న సీమర్ టఫీ వెస్టిండీస్‌లో జరిగే ప్రపంచకప్ ట్వంటీ-20కల్లా పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడుతాడని న్యూజిలాండ్ జట్టు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఈ విషయమై టఫీ మాట్లాడుతూ.. చేతి గాయం నుంచి నాలుగు వారాల్లో కోలుకుంటానని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇంకా ట్వంటీకి అందుబాటులో ఉంటానని టఫీ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే.. టఫీ సహచరుడు, న్యూజిలాండ్ క్రికెటర్ అయిన నెయిల్ బ్రూమ్ కూడా గాయానికి గురైయ్యాడు. టఫీ తరహాలో చేతి ఎముక విరగడంతో ట్వంటీ-20కి దూరమైయ్యాడు. ఇంకా గాయంతో బాధపడుతున్న బ్రూమ్ ప్రతిష్టాత్మక పరిమిత ఓవర్ల ట్వంటీ-20 మెగా ఈవెంట్‌కు దూరమైయ్యాడని జట్టు వర్గాలు తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu