దాదాపు ఐదేళ్ళ పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆండీ బ్లిగ్నాట్ పట్ల జింబాబ్వే క్రికెట్ సెలక్టర్లు కరుణ చూపారు. వచ్చే నెలలో కరేబియన్ దీవుల్లో ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ప్రపంచ ట్వంటీ-20 టోర్నమెంట్ కోసం ప్రకటించిన జాతీయ జట్టులో బ్లిగ్నాట్‌కు చోటు కల్పించారు. 31 సంవత్సరాల బ్లిగ్నాట్‌ను 2004 సంవత్సరంలో తలెత్తిన వర్ణవివక్ష కారణంగా జాతీయ జట్టును తొలగించిన విషయం తెల్సిందే.
అయితే, ఇటీవల జరిగిన స్వదేశీ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో బ్లిగ్నాట్ అదరగొట్టాడు. 133.73 స్ట్రైక్ రేట్‌తో, 37 సగటుతో 111 పరుగులు చేసి, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా. జాతీయ జట్టులో చోటు దక్కించున్నట్టు ఆ దేశ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ట్వంటీ-20 టోర్నమెంట్ ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభంకానుంది. అంతేకాకుండా, జింబాబ్వే జట్టుకు కొత్త కోచ్‌గా ఆలెన్ బట్చర్ నియమితులయ్యే అవాశాలు ఉన్నాయి. కాగా, శ్రీలంక, న్యూజిలాండ్ గ్రూపులో జింబాబ్వే ఉంది. ఈ జట్టు మే మూడో తేదీన శ్రీలంకతో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది.
జింబాబ్వే జట్టు వివరాలు.. ప్రోస్ప్ర్ ఉత్సెయా (కెప్టెన్), బ్రెండన్ టేలర్, ఛార్లెస్ కోవెంట్రీ, ఆండీ బ్లిగ్నాట్, హామిల్టన్ మస్కదా, తతేందా తైబు (వికెట్ కీపర్), గ్రెగ్ లాంబ్, ఎల్టాన్ చిగుంబరా, వుసి సిబందా, రేప్ ప్రిస్, గ్రీమీ క్రీమెర్, ఛాము చిభాబా, క్రిస్ మోపు, టిమ్సీన్ మరుమా, క్రైగ్ ఎర్వీన్‌లు ఉన్నారు.