డబ్బు, కీర్తితో అనేక వ్యసనాలు వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది వ్యక్తులు అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ, కొంతమంది కొన్ని వ్యసనాలకు బానిసగా మారిపోతున్నారు. జింబాబ్వే క్రికెటర్ సీన్ విలియమ్స్ విషయంలో కూడా అంతే. జింబాబ్వే క్రికెట్ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో సీన్ విలియమ్స్ ఒకరు.
గతంలో అనేకసార్లు వారిని క్లిష్ట పరిస్థితుల నుండి జట్టును గట్టెక్కించిన ఖ్యాతి అతనికి ఉంది. అయితే, ఈ సీనియర్ క్రికెటర్ ఇప్పుడు తన మాదకద్రవ్య వ్యసనం సమస్యలను బహిరంగంగా అంగీకరించాడు. ఇది అతని కెరీర్‌ను త్వరగా కోల్పోయేలా చేసింది. ఐసిసి యాంటీ డోపింగ్ విధానాల కారణంగా సీన్ విలియమ్స్ ప్రపంచ కప్ అర్హత రౌండ్ నుండి వైదొలిగినట్లు సమాచారం.
విలియమ్స్ మాదకద్రవ్య వ్యసనం కారణంగా ప్రపంచ కప్‌కు ఎంపిక కాకపోయి వుండవచ్చునని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం బయటపడటంతో, భవిష్యత్తులో సీన్ విలియమ్స్‌ను ఏ ఫార్మాట్‌లోనూ ఎంపిక చేయబోమని జింబాబ్వే క్రికెట్ తెలియజేసింది. 39 ఏళ్ల క్రికెటర్ త్వరలో పునరావాసం పొందబోతున్నాడని, భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో భాగం కాకపోవచ్చునని తేలింది.