Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. జాక్‌ క్రాలే జారిపోయాడు..

ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. జాక్‌ క్రాలే జారిపోయాడు..
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (23:00 IST)
Zak Crawley
ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో తొలి రెండు టెస్టులకు అత్యుత్తమ జట్లను ఎంపిక చేయలేదని ఇప్పటికే  ఇంగ్లండ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ క్రాలే గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. 23ఏండ్ల జాక్‌ క్రాలే కుడి మణికట్టుకు గాయం కావడంతో చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది.
 
శుక్రవారం నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ ప్రాక్టీస్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట క్రాలే ఫ్లోర్‌పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది. 23 ఏళ్ల క్రాలీ, శుక్రవారం చెన్నైలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు శిక్షణ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వెలుపల పాలరాయి అంతస్తులో జారిపోయాడు.
 
క్రాలే కుడి మణికట్టు బెణికిందని స్కానింగ్‌లో నిర్ధారణ అయిందని, అతడు తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని ఇంగ్లాండ్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మరొకొన్ని వారాల పాటు అతని గాయాన్ని ఇంగ్లాండ్‌ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు చట్టాలపై కోహ్లీ ట్వీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కెప్టెన్ కాదు.. హిట్ మ్యాన్