Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీసీసీఐ డ్రీమ్ టెస్టు జట్టులో విరాట్ కోహ్లీ నో: ధోనీకి 4వ స్థానం, సచిన్‌కు 8వ స్థానం

టీమిండియా డ్రీమ్ టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ప్రస్తుతం టీమిండియాకు సూపర్ క్రేజ్ సంపాదించి పెట్టిన విరాట్ కోహ్లీకి స్థానం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. భారత జట్టు పాల్గొన్న 500వ టెస్టు

Advertiesment
Yuvraj Singh In India's Dream Test XI; No Virat Kohli
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:31 IST)
టీమిండియా డ్రీమ్ టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ప్రస్తుతం టీమిండియాకు సూపర్ క్రేజ్ సంపాదించి పెట్టిన విరాట్ కోహ్లీకి స్థానం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. భారత జట్టు పాల్గొన్న 500వ టెస్టులో కివీస్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా డ్రీమ్ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో కోహ్లీకి చోటు దక్కలేదు. 
 
ఓటింగ్ ప్రకారం ఆటగాళ్లను ఎంచుకున్న బీసీసీఐ.. రాహుల్ ద్రావిడ్‌కు అగ్రస్థానంలో చోటు కల్పించింది. రెండో స్థానంలో అనిల్ కుంబ్లే, మూడో స్థానంలో కపిల్ దేవ్, నాలుగో స్థానాన్ని ధోనీ కైవసం చేసుకున్నారు. ఇక క్రికెట్ జాంబవంతుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 8వ స్థానంలో నిలిచాడు. అయితే ఈ డ్రీమ్ జట్టులో టీమిండియా ప్రస్తుత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు లభించలేదు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఇక యువరాజ్ సింగ్‌, వీవీ లక్ష్మణ్‌లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. 
 
ఇకపోతే.. టీమిండియా డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టుకు ఎంపిక క్రికెటర్లు ఎవరెవరంటే..?
సునీల్ గవాస్కర్ (అభిమానుల ఓటింగ్ ప్రకారం).. సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు ఉన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాన్పూర్ టెస్ట్‌లో భారత్‌దే విజయం.. న్యూజిలాండ్ వెన్ను విరిచిన అశ్విన్‌