Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్.. ఎగిరి గంతేసిన సారా టెండూల్కర్

Advertiesment
Sara Tendulkar
, గురువారం, 19 అక్టోబరు 2023 (22:42 IST)
Sara Tendulkar
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిందని టాక్ వస్తోంది. 
 
ఎందుకంటే.. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా.. సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సిక్స్‌లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతన్ని అభినందించింది. 
 
దాంతో ఈ ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఇప్పటికే బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. 
 
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెంచరీ సిక్సర్ షాట్‌తో బంగ్లాకి ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ''కింగ్" కోహ్లీ