Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాత్రూమ్‌లోనే చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్

Advertiesment
Women’s World Cup 2022
, గురువారం, 3 మార్చి 2022 (13:05 IST)
Nicola Carey
క్రికెట్ మ్యాచ్‌కు ముందు ఓ మహిళా క్రికెటర్ బాత్రూమ్‌లోనే చిక్కుకుంది. 30నిమిషాల తర్వాత ఆమె గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన ఆమెను చూసి అందరూ షాకయ్యారు. అంతసేపు ఎక్కడికి పోయిందంటూ చర్చించుకోవడం మొదలెట్టారు. 
 
ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి షురూ కానున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ఆస్ట్రేలియా మహిళా జట్టు న్యూజిలాండ్‌కు వచ్చింది. 
 
వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్‌ ఆడింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభం వేళలో గ్రౌండ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా మహిళా జట్టు సభ్యురాలు నొకోలా కేరి కనిపించలేదు. దీంతో జట్టు సభ్యులు ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు. ఆమె ఎక్కడి వెళ్లిందోనని ఆందోళనకు గురయ్యారు. 
 
ఆమె కోసం అంతటా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అరగంట తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టింది. అయితే అరగంట పాటు ఎక్కడకు వెళ్లారన్న ఆరా తీస్తే.. షాకింగ్ అంశాన్ని చెప్పుకొచ్చారు. 
 
బాత్రూంకు వెళ్లిందని.. డోర్ లాక్ కావడంతో అక్కడే చిక్కుకుపోయిందని తెలిసింది. ఆపై జట్టు మేనేజర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వేరొక కీతో తలుపులు తెరవడంతో బయటికి వచ్చినట్లు తెలిసింది. 
 
బాత్రూంలో ఇరుక్కుపోయిన వేళ.. తనకేం చేయాలో మొదట అర్థం కాలేదని.. ఆ తర్వాత బయటకు వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఒకవేళ.. మాస్టర్ కీ లేకుంటేనా.. మ్యాచ్ కోసం తలుపు బద్ధలు కొట్టుకొని అయినా బయటకు వచ్చేదానిని అంటూ ఆమె చెప్పిన మాటలకు నవ్వులు విరబూస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నుంచి రష్యాను బహిష్కరించాలి