Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్తాన్‌ను అనుసరిస్తున్న భారత క్రికెట్ జట్టు... ఏ విషయంలో?

లండన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఫైనల్‌లో పాకిస్తాన్ అన్ని విధాల తన సత్తా చాటి భారత్‌పై నెగ్గింది. అంతటితో ఆగలేదు. వారు ఫాలో అయ్యే సెంటిమెంట్‌ను భారత్‌కు అంటించారు. అదేదో కాదు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా కూడా ఫలితం కోచ్ అనుభవించడం. ఆటగాళ్లు,

పాకిస్తాన్‌ను అనుసరిస్తున్న భారత క్రికెట్ జట్టు... ఏ విషయంలో?
, బుధవారం, 21 జూన్ 2017 (20:18 IST)
లండన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఫైనల్‌లో పాకిస్తాన్ అన్ని విధాల తన సత్తా చాటి భారత్‌పై నెగ్గింది. అంతటితో ఆగలేదు. వారు ఫాలో అయ్యే సెంటిమెంట్‌ను భారత్‌కు అంటించారు. అదేదో కాదు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా కూడా ఫలితం కోచ్ అనుభవించడం. ఆటగాళ్లు, కోచ్ మధ్య తలెత్తిన వివాదం దేశ ప్రతిష్టను మంటల్లో కలిపేలా ఉండడం. ఇప్పుడు భారత కోచ్‌గా ఉన్న మాజీ స్పిన్నర్ కుంబ్లే ఆటగాళ్లు అవమానపరచారని ఆ పదవికి రాజీనామా చేసాడు. 
 
ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు కూడా మ్యాచ్‌లు ఓడిన అనేక సందర్భాల్లో కోచ్‌లు రాజీనామాలు చేసారు. ఈ విషయంలో ఆ జట్టు ఇంకొంచెం ముందడుగు వేసింది. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్ పోటీల సమయంలో పాకిస్తాన్ జట్టుకు కోచ్ భాద్యతలు నిర్వహిస్తున్న "బాబ్ ఊమర్" టోర్నీ మధ్యలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. కోచ్ కఠినంగా సాధన చేయిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. 
 
ఇది కాస్తా ఆటగాళ్లను ఇబ్బందికి గురిచేస్తుంది. ఇంత పెద్ద భారతదేశంలో ఎంతోమంది ప్లేయర్లు అవకాశాలు రాక అలానే ఉండిపోతున్నారు. కానీ అవకాశం వచ్చిన తర్వాత గురువు లాంటి కోచ్ మాట వినకుండా మ్యాచ్‌లు ఓడిపోవడానికి కారణం అవుతున్నారు. ఇకపై మన భారత జట్టు గురువు లేని ఏకలవ్యుడిలా ఉంటుందా లేక అర్జునిలా ముందుకు దూసుకుపోతుందో కాలమే నిర్ణయించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడు తెల్లటి వస్త్రంలాంటివాడు.. భారత్‌ కోసమే జీవిస్తాడు.. మరణిస్తాడు కూడా.... ఎవరా క్రికెటర్?