Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు వెస్టిండీస్‌తో ఆఖరి వన్డే... భారత్‌కు పరీక్ష

కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు గురువారం ఓ పరీక్ష ఎదురుకానుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్‌ను ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో ఆడనుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్

Advertiesment
నేడు వెస్టిండీస్‌తో ఆఖరి వన్డే... భారత్‌కు పరీక్ష
, గురువారం, 6 జులై 2017 (14:00 IST)
కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు గురువారం ఓ పరీక్ష ఎదురుకానుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్‌ను ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో ఆడనుంది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దయినా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గడంతో 4-0తో సిరీస్‌ మనదేనని ఊహించాం. 
 
కానీ, గత మ్యాచ్‌లో విండీస్‌ దిమ్మదిరిగే షాక్‌ ఇవ్వడంతో సీన్‌ రివర్సైంది. ఇప్పుడు ఆఖరి వన్డేలో నెగ్గితేనే కోహ్లీసేన సిరీస్‌ దక్కించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కరీబియన్లు సిరీస్‌ సమం చేస్తే మాత్రం భారత్‌కు అవమానమే. అందుకే ఇపుడు భారత్ ముందు ఓ సవాల్ ఉంది. 
 
సబినా పార్క్‌లో జరిగే ఆఖరాటలో నెగ్గి 3-1తో సిరీస్‌ కైవసం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తుండగా.. సిరీస్‌ సమం చేయాలని విండీస్‌ ఆశిస్తోంది. గత పోరులో తమ విజయం గాలివాటం కాదని చెప్పాలని ఆతిథ్య జట్టు పట్టుదలతో ఉంది. 
 
అయితే, సిరీస్‌ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్‌ అంతా సత్తా చాటాల్సిందే. గత మ్యాచ్‌లో అనూహ్య విజయం విండీస్‌ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది. సిరీస్‌ సమం చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని ఆ జట్టు భావిస్తోంది. ఓడినా తమకు పోయేదేమీ లేదు గనుక కరీబియన్లు స్వేచ్ఛగా ఆడి మరో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశం లేకపోలేదు. 
 
జట్లు (అంచనా)
భారత్‌: అజింక్యా రహానె, శిఖర్ ధవన్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్‌, ధోనీ, కేదార్‌/రిషభ్‌, హార్దిక్ పాండ్యా‌, జడేజా/అశ్విన్‌, కుల్దీప్‌, ఉమేష్‌, షమి.
 
వెస్టిండీస్‌: లూయిస్‌, కైల్‌ హోప్‌, షై హోప్‌ (కీపర్‌), ఛేజ్‌, మహమ్మద్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), పావెల్‌, నర్స్‌, బిషూ, జోసెఫ్‌, విలియమ్స్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ గ్రేడ్‌పై మళ్లీ రగడ.. ధోనీకి మద్దతుగా బీసీసీఐ ప్రకటన అవసరమేమో?